16వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

మదనపల్లె, ఆగస్టు 17: (gtvmedia)మదనపల్లె పట్టణంలోని 16వ వార్డు పెంచుపాడు రోడ్, కమ్మ వీధిలోని 168, 169 బూత్‌ల పరిధిలో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ, జనరల్ సెక్రటరీ రామాంజినేయులు, క్లస్టర్ ఇంచార్జి తాజ్ బాషా, యూనిట్ ఇంచార్జి సాకే కిట్టన్న, వార్డు ప్రెసిడెంట్ బోయపాటి రానా, సీనియర్ నాయకులు వంటికొండ వెంకటేష్, బూత్ ఇంచార్జి స్వప్నతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *