తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ఉదయం శ్రీమలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై తిరుమల చతుర్మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.



గోవుల గోపన్న అలంకారంలో కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీవారి దివ్యమంగళ దర్శనాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోరికలను తీర్చే కల్పవృక్ష స్వరూపుడిగా కొలిచే శ్రీవారి దర్శనంతో భక్తుల హృదయాల్లో భక్తి, ఆనందం వెల్లివిరిసింది.
ఓం నమో వేంకటేశాయ! 🙏
