పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి, ఆగస్టు 31: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో అందిన అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ ఏ. వెంకటేష్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు.

కార్యక్రమంలో మొత్తం 316 అర్జీలు అందగా, వాటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.

అంగళ్ల గ్రామానికి హంద్రీనీవా ద్వారా తాగునీరు, కాలువపై బ్రిడ్జి నిర్మాణం; పుంగనూరు మండలంలోని ఆరు గ్రామాలకు సమీపంలో రేషన్ షాపు ఏర్పాటు; కలకడ మండలంలో భూ వివాదంపై విచారణ వంటి సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *