మదనపల్లి అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే షాజహాన్ భాషా వినతి

మదనపల్లి, ఆగస్టు 19:( gtvmedia)మదనపల్లి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు.

నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే షాజహాన్ భాషా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందించి ఆయా పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

మదనపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *