మదనపల్లె, సెప్టెంబర్ 27: మదనపల్లిలో USFI ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా తొలి మహాసభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి USFI రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వేపల్లి నరసింహులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ₹7,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. GO No.77ను రద్దు చేసి PG విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలని కోరారు.
అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల విద్యా హక్కులు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని అన్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం USFI ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని సర్వేపల్లి నరసింహులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆఫ్రిద్, కార్యదర్శి కమలాకర్ నాయుడు, ఉపాధ్యక్షులు గణేష్ రాయల్, సాయికుమార్ రెడ్డి, సాయి హేమంత్, రాజు, మన్సూర్, భార్గవ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
