తరిగొండలో పుష్కరిణి పునరుద్ధరణకు శంకుస్థాపన

తరిగొండలో పుష్కరిణి పునరుద్ధరణకు శంకుస్థాపన

పీలేరు, సెప్టెంబర్ 28: పీలేరు నియోజకవర్గం తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పుష్కరిణి పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా, పీలేరు ఎమ్మెల్యే శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును సన్మానించారు. ఆలయ పుష్కరిణి పునరుద్ధరణతో భక్తులకు మరింత సౌకర్యం కలగడంతో పాటు ఆలయ ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరింత పెరగనుందని కార్యక్రమంలో పేర్కొన్నారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీటీడీ అధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *