విద్యుత్ సరఫరా మెరుగుదలతో గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం – ఎమ్మెల్యే షాజహాన్ భాషా
రామసముద్రం, సెప్టెంబర్ 28:
మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం పెద్దకురపల్లి గ్రామ పరిధిలోని మట్టివారిపల్లిలో నూతనంగా మంజూరైన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సోమవారం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడంతో పాటు రైతులు, గృహ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

