మదనపల్లి 42వ వార్డులో జనసేన అభ్యర్థి గాయత్రికి మద్దతుగా కూటమి నేతల ప్రచారం

మదనపల్లి, అక్టోబర్ 24: మదనపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 42వ వార్డులో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గాయత్రి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ కూటమి నాయకులు శివరాం, కిరణ్ రెడ్డి, గోపాల్‌తో పాటు టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వార్డులో ప్రజలను కలుస్తూ జనసేన అభ్యర్థి గాయత్రికి మద్దతు ఇవ్వాలని కోరారు. కూటమి పార్టీల నాయకులు సమన్వయంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *