స్థానిక ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి

రామసముద్రం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా

రామసముద్రం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా శనివారం ఉదయం నుంచి రామసముద్రం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల పరిస్థితులు, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామస్థాయిలో నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తూ ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, సమష్టి కృషి అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *