భక్తి శ్రద్దలతో వరలక్ష్మీ వ్రతం

మదనపల్లి ఆగస్టు 21:( gtvmedia)శ్రావణమాసం రెండో శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని మదనపల్లి పట్టణంలో హిందువులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని పలు ఇళ్లలో వారి స్తోమతకు తగ్గట్టు మహిళలు వారి ఇళ్లలో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. నీరు గుట్టువారిపల్లి లోని చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని, కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. పట్టణ ప్రజలను ఈ దృశ్యం ఆకట్టుకుంది. అలాగే కోర్టులో గంగమ్మ ఆలయం, వాసవి దేవి ఆలయం, సిటిఎం రోడ్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *