మదనపల్లె,ఆగస్టు 8 : (gtvmedia)మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎంపి మిథున్ రెడ్డి కృషి చేస్తున్నారని శివాలయం మాజీ చైర్మన్ బండపల్లి వెంకటరమణ పేర్కొన్నారు. శనివారం మదనపల్లి మండలంలోని సిటిఎం టు పంచాయతీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు
అనునిత్యం ప్రజా సంక్షేమం కోరుతూ ప్రజల మనిషిగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఖ్యాతి పొందాడన్నారు.మదనపల్లి మండలం సిటిఎం క్రాస్ రోడ్డు పంచాయతీ అడ్డగింటి వారి పల్లెలో ఎంపీ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణానికి ఎంపీ మిథున్ రెడ్డి రెండు లక్షలు కేటాయించారన్నారు. కార్యకర్తలకు కష్టాల్లో ఆదుకునే ఏకైక నాయకుడు మిథున్ రెడ్డి అని అన్నారు. ఎంపీగా హ్యాట్రిక్ సాధించిన ఆయన స్ఫూర్తితో భవిష్యత్తు తరాల రాజకీయ నాయకులు పనిచేయాలని వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ex ఎంపీటీసీ సుధాకర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, భువనేశ్వర్ రెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లి అభివృద్ధికి మిథున్ రెడ్డి కృషి
