మదనపల్లె, సెప్టెంబర్ 8: విద్యార్థుల్లో ర్యాగింగ్, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు, సురక్షితమైన, ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మదనపల్లెలో యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్ నివారణ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.మదనపల్లె DSP ఎం. బుచ్చి రాజు గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. కళా వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా dsp మాట్లాడుతూ, ర్యాగింగ్ అనేది సరదా లేదా సీనియర్లు–జూనియర్ల మధ్య పరిచయం పెంచుకునే మార్గం కాదని, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మరియు విద్యా ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపే తీవ్రమైన చర్య అన్నారు.
విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో వ్యవహరించాలని, ర్యాగింగ్ వంటి చర్యలకు పూర్తిగా దూరంగా ఉండి తమ విద్యా మరియు కెరీర్ లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు.
CI కె. కళా వెంకటరమణ విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే సామాజిక, మానసిక మరియు విద్యాపరమైన పరిణామాలను వివరించారు.
కళాశాల డైరెక్టర్ ఎం. రామలింగారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి భద్రత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం మరియు నైతిక విలువలకు కళాశాల అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
కళాశాల ప్రిన్సిపాల్ డా. రాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
