ఆద్య హాస్పిటల్ నూతన భవన ప్రారంభోత్సవంలో దొమ్మలపాటి రమేష్

మదనపల్లె, ఆగస్టు 28: (gtvmedia)మదనపల్లె పట్టణంలోని ప్రశాంత్ నగర్‌లో నూతన భవనంలోకి మార్చిన ఆద్య హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి నూతన భవనాన్ని పరిశీలించిన దొమ్మలపాటి రమేష్, ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రి నిర్వాహకులు పనిచేయాలని ఆకాంక్షించారు. మదనపల్లెతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన, ఆధునిక వైద్య సదుపాయాలతో ఆద్య హాస్పిటల్ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *