మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 23వ వార్డు కమ్మవీధి ప్రాంతంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు), 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బోయపాటి రానాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రాటకొండ మధుబాబు, వంటికొండ వెంకటేష్, పూల మురళి, జనసేన పార్టీ రూరల్ ప్రధాన కార్యదర్శి శంకర, రామాచార్లపల్లి యుగంధర్, చిప్పిలి పోలశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

