మదనపల్లె, సెప్టెంబర్ 15:
మదనపల్లె మండలం బొమ్మనచెరువు గ్రామానికి సంబంధించిన 10 పోలింగ్ కేంద్రాలను బొమ్మనచెరువు లోని ఒకే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణశర్మ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా ఎస్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ బొమ్మనచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఒకేచోట 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ఎన్నికల రోజున ఓటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, పాఠశాలకు ఒకే చిన్న ప్రవేశ ద్వారం ఉండటం, అది కూడా ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో, 10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓటర్లు ఒకేసారి పెద్ద సంఖ్యలో తరలివస్తే ట్రాఫిక్ సమస్యలు, వాహనాల రాకపోకలకు అంతరాయం, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మరియు ఇతర ఓటర్లు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
బొమ్మనచెరువుకు సమీపంలోని పలు గ్రామాల ప్రజలకు మందబండ గ్రామం మరింత అనుకూలమైన ప్రదేశంగా ఉంటుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి ఎస్ రెడ్డి, నాయకులు యూనస్, గ్రానైట్ మహేశ్, నవాజ్ అలీ ఖాన్, సాధిక్, షేక్ జబి, యాసిన్, బొమ్మనచెరువు గ్రామస్తులు ఎం పి టీ సి కదిరిపతి, రమణ, ఎల్లుట్ల గణేష్, పి. అమర తదితరులు పాల్గొన్నారు.
