మదనపల్లె, సెప్టెంబర్ 15: మదనపల్లె నియోజకవర్గ పరిధిలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ వినాయక మండపాలను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు సందర్శించారు.
వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం నిర్వాహకులు, భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, ఐశ్వర్యాలు ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ ఆచారి, తులసి, మార్పూరి వరుణ్, మార్పూరి గాంధీ, టీడీపీ మదనపల్లె పట్టణ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ చింటూ, రెండో వార్డ్ మధు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్,
బండి అమర, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, ప్రభు గౌడ్, ప్రవీణ్, సన్నీ, వినయ్, చందు, శేఖర, బాబు నాయుడు మరియు కూటమి నాయకులు స్థానికులు పాల్గొన్నారు.
