జ్ఞానజ్యోతి-50 శిక్షణపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన పెంచాలి

మదనపల్లె, ఆగస్టు 11: ప్రభుత్వం అమలు చేస్తున్న జ్ఞానజ్యోతి-50 శిక్షణ కార్యక్రమంపై అంగన్వాడీ కార్యకర్తలు పూర్తి అవగాహన పెంచుకోవాలని సీడీపీవో నాగవేణి సూచించారు. మంగళవారం మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మదనపల్లె నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాగవేణి మాట్లాడుతూ 3 నుంచి 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమగ్ర శిక్షణ అందించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, సంరక్షణతో పాటు వారి శారీరక, మానసిక వికాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై కూడా అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే ప్రత్యేక ప్రతిభ కలిగిన బాలబాలికలను గుర్తించి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు.

కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్ శ్వేతతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *