బీసీలకు 34% రిజర్వేషన్‌.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయం

టీడీపీ హయాంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత

Day-2 | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2026

ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ధన్యవాదాలు తెలిపారు.

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెంచాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ తరఫున రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి రాజకీయ ప్రాతినిధ్యానికి మరింత అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి, టీడీపీ అధినాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *