ఫోర్జరీ కేసులో శ్రీరాములు నాయుడు అరెస్టు

మదనపల్లె, అక్టోబర్ 26

మదనపల్లి పట్టణం రెడ్డప్ప నాయుడు కాలనీ చెందిన కడియాల శ్రీరామ నాయుడు ని ఫోర్జరీ కేసులో వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ సిఐ మోహన్ కథనం మేరకు… నీరుగట్టువారిపల్లెకు చెందిన సులోచన భూ కబ్జాల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఫోర్జరీలకు పాల్పడిన ఆమె అనుచరుడు డ కడియాల శ్రీరాములు నాయుడును సోమవారం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

1town సీఐ మోహన్ కుమార్ కథనం మేరకు . నీరుగట్టువారిపల్లికి చెందిన కోనేటి సులోచన, అనుచరుడు మోహన్ ను ఇటీవల అరెస్టు చేశామన్నారు.. ఆకేసులో ఆమెకు ప్రధాన అనుచరుడు, రెడ్డప్ప నాయుడు కాలనీలో కాపురం ఉండే కడియాల శ్రీరాములు నాయుడు

సులోచనతో చేతులు కలిపి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.కోట్ల విలువైన భూములను స్వాహా చేసారన్నారు.
బాదితులు వెంకటరమణారెడ్డి, వెంకటేష్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు తో కోనేటి సులోచన తన అనుచరులతో కలిసి వెంకటరమణారెడ్డిపై తరుచూ గొడవలు పెట్టుకుని ఆయన్ను చంపుతామని బెదిరిస్తుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు.
ఈ కేసులో కోనేటి సులోచన, ఆమె తల్లి రెడ్డెమ్మ, సోదరుడు శ్రీనాధ్ అనుచరులు మోహన్, సీటీఎం రోడ్డులోని రెడ్డెప్ప నాయుడు కాలనీకి చెందిన కడియాల శ్రీరాములు నాయుడులపై కేసు నమోదు చేశామన్నరు. ఈ కేసులో సులోచన, మోహన్ ను ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సీఐ పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా శ్రీరాములు నాయుడు పట్టుబడడంతో అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచడం జరిగిందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *