15వ వార్డులో కూటమి అభ్యర్థి సిరివేలు చరణ్‌కు మద్దతుగా గంగారపు రామదాస్ చౌదరి ప్రచారం

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15వ వార్డు కూటమి కౌన్సిలర్ అభ్యర్థి సిరివేలు చరణ్‌కు మద్దతుగా జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె ఇన్‌ఛార్జి గంగారపు రామదాస్ చౌదరి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలిసి కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వార్డు అభివృద్ధికి కూటమి కృషి చేస్తుందని వివరించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి సిరివేలు చరణ్‌ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *