మదనపల్లె సబ్‌ డివిజన్‌లో ఐదుగురు సీఐల బదిలీ

అన్నమయ్య జిల్లా, మదనపల్లె | సెప్టెంబర్ 17:
మదనపల్లె సబ్‌ డివిజన్‌లో ఐదుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి:

  • వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి → ఆర్‌ఎస్‌టీఎఫ్‌
  • సీసీఎస్ సీఐ మోహన్ → మదనపల్లె వన్‌టౌన్
  • టూటౌన్ సీఐ మహమ్మద్ రఫీ → మదనపల్లె తాలూకా సీఐ
  • తాలూకా సీఐ కళా వెంకటరమణ → బి.కొత్తకోట
  • బి.కొత్తకోట సీఐ గోపాల్‌రెడ్డి → మదనపల్లె టూటౌన్

బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త బాధ్యతల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *