దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తకు పరామర్శ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మునీంద్రను పరామర్శించిన సుగవాసి ప్రసాద్ బాబు, జునైద్ అక్బరి

మదనపల్లె, ఆగస్టు 19: నిమ్మనపల్లి మండలం రాచివేటవారిపల్లి గ్రామం గుండ్లబురుజుకు చెందిన టీడీపీ కార్యకర్త మునీంద్రపై వైసీపీ నాయకులు దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా తనయుడు, జునైద్ అక్బరి పరామర్శించారు.

జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబుతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన జునైద్ అక్బరి మునీంద్ర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఆర్జే వెంకటేష్,రాజన్న ,షంషీర్ ,రమణ,శశి పాల్గొన్నారు

ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి, దాడికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *