పేదల సేవలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లు

మదనపల్లిలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా

మదనపల్లి, సెప్టెంబర్ 1: మదనపల్లి పట్టణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని నిమ్మనపల్లి రోడ్డు వార్డు సచివాలయం సమీపంలో, బ్రహ్మ వీధి సాయిబాబా ఆలయం సమీపంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ భాషా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలు, వృద్ధులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.4 వేల పింఛన్ అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పింఛన్లను పెంచి పేదల జీవితాల్లో భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు.

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *