వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు

బాధితుడికి ధైర్యం చెప్పిన సుగవాసి ప్రసాద్ బాబు

మదనపల్లె, ఆగస్టు 19: (gtvmedia)నిమ్మనపల్లి మండలం రాచివేటివారిపల్లిలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన టీడీపీ నాయకుడు మునీంద్రను టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైసీపీ నాయకులు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని నిమ్మనపల్లి పోలీసులను కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా తనయుడు జునైద్ అక్బరి, టీడీపీ మండల అధ్యక్షుడు రాజన్న, టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్జే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *