మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు.. భారీగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు
చిన్నమండెం, ఆగస్టు 9: (gtvmedia)అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో శ్రీ శ్రీ విరూపాక్షమ్మ బోనాల పండుగను అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కడప, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబురెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రికి శుభాకాంక్షలు
ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి, జంగాల శివరామ్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో పాల్గొనేందుకు వేలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో చిన్నమండెం పరిసర ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ విరూపాక్షమ్మ బోనాల పండుగలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
