ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టుకు ఆర్థిక సహాయం

యుగంధర్‌ను పరామర్శించిన పలువురు.. రూ.40 వేల ఆర్థిక సాయం

మదనపల్లె, ఆగస్టు 9: (gtvmedia)అంగళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హన్స్ ఇండియా జర్నలిస్ట్ యుగంధర్‌ను పలువురు పరామర్శిస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

ఆదివారం మదనపల్లెలోని టీచర్స్ కాలనీలో ఉన్న యుగంధర్ నివాసానికి వెళ్లిన శ్రీకృష్ణారెడ్డి జూనియర్ కళాశాల చైర్మన్ ఎన్. కృష్ణారెడ్డి ఆయనను పరామర్శించారు. యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, చికిత్సకు తన వంతు సహాయంగా రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా యుగంధర్‌కు ధైర్యం చెప్పిన కృష్ణారెడ్డి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అలాగే ఐటీయూసీ అధ్యక్షుడు గొంగడి కృష్ణమూర్తి కూడా యుగంధర్‌ను పరామర్శించి, ఆయనకు ధైర్యం చెప్పారు. జర్నలిస్ట్ యుగంధర్ త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *