ఇ-డార్ విధానంపై అవగాహన పెంచుకోవాలి

పోలీస్ కంప్యూటర్ ఆపరేటర్లకు అదనపు ఎస్పీ వెంకటాద్రి సూచన

మదనపల్లె, ఆగస్టు 19: (gtvmedia)పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు ఇడార్ (e-DAR) విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి సూచించారు.

బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్ల కంప్యూటర్ ఆపరేటర్లకు ఇ-డార్ విధానంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు త్వరితగతిన బీమా పరిహారం అందించేందుకు ఇ-డార్ విధానం కీలకమన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే వాహనాలు, బాధితులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎలాంటి జాప్యం లేకుండా నమోదు చేయాలని సూచించారు. వివరాల నమోదులో కచ్చితత్వం, వేగం పాటించాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డీటీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ డి. రమేష్ బాబు, ఎన్‌ఐసీ ప్రతినిధి ఎస్. ఖలీల్‌తో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల కంప్యూటర్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *