పీలేరు, ఆగస్టు 8: (gtvmedia)అన్నమయ్య జిల్లా పీలేరు మండల పరిధిలో అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. పీలేరు మండలం చిత్తూరు రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
రాత్రి సమయంలో తిరుపతి నుంచి కదిరి, దేవరపల్లి వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు, ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతుడి గుర్తింపుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
