తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం

తిరుమల, ఆగస్టు 30: (gtvmedia)తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఆదివారం సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠంలోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.

ప్రస్తుతం వివిధ దర్శనాలకు పడుతున్న సమయం వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఉచిత సర్వదర్శనం: సుమారు 12 గంటలు
  • టైమ్ స్లాట్ (SSD) టోకెన్ దర్శనం: సుమారు 5 గంటలు
  • రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం: సుమారు 4 గంటలు

నిన్నటి శ్రీవారి దర్శన వివరాలు

ఆగస్టు 29న మొత్తం 85,246 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 34,085 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

శ్రీవారి హుండీ ద్వారా రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల సమాచారం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *