8:30 గంటల తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి
అన్నమయ్య జిల్లా మదనపల్లె: (gtvmedia)మదనపల్లె పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో 125 మంది విద్యార్థులు, కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని మిట్స్ కళాశాలలో 387 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షా నిబంధనల ప్రకారం ఉదయం 8:30 గంటల తర్వాతే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి, విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను పర్యవేక్షించారు.

పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు.
