ప్రజల ప్రశంసల జల్లులు
మదనపల్లి అక్టోబర్ 24 :
చిన్నపాటి వర్షం వస్తే చాలు పరుగులు ఎత్తి ఇళ్లకు చేరుతాము.
వర్షానికి తడిస్తే జలుబు, దగ్గు, జ్వరాలు వస్తాయని భయపడతాము.
అలాంటిది మదనపల్లిలో జోరుగా వర్షం కురుస్తున్నా… ఒక్కసారిగా పెరిగిన ట్రాఫిక్ ను నియంత్రించేందుకు మదనపల్లి ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా వర్షంలో తడుస్తూనే విధులు నిర్వహించారు.
స్థానిక బీసెంట్ సర్కిల్ వద్ద తన సిబ్బందితో, జోరు వర్షం పడుతున్నా కూడా చాంద్ బాషా అటూ ఇటూ తిరుగుతూ వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ ని నియంత్రించారు.
ఈ దృశ్యం చూసిన ప్రజలు ఆయనపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
