మదనపల్లె, అక్టోబర్ 27: వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా విమర్శించారు. బెంగళూరు బస్టాండ్ వద్ద టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి 18 మంది కౌన్సిలర్ల స్థానాలను దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా పాలన అందిస్తున్న చంద్రబాబుపై వైసీపీ విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వైసీపీ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి: ఎమ్మెల్యే షాజహాన్ భాషా
