అక్టోబర్ 2న మదనపల్లిలో జరగనున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా…
మదనపల్లి అభివృద్ధి, హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రాంతానికి కలిగే అవకాశాలు, రైతులకు అందే ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
మీ సందేశాన్ని 1 నిమిషంలోపు చిన్న వీడియోగా రికార్డ్ చేసి జీటీవీ మీడియాకు పంపండి.
మీరు పంపిన వీడియోలను పరిశీలించిన అనంతరం జీటీవీ మీడియా వేదికగా ప్రసారం చేస్తాము.
వీడియో ఎలా ఉండాలి?
👉 1 నిమిషంలోపు వీడియో
👉 స్పష్టమైన, అర్థవంతమైన సందేశం
👉 మదనపల్లి అభివృద్ధిపై మీ అభిప్రాయం
👉 హార్టికల్చర్ హబ్‌పై మీ స్పందన
👉 వీడియోను జీటీవీ మీడియాకు పంపండి
ఎందుకంటే…
రాయలసీమ హార్టికల్చర్ హబ్‌ను సుమారు ₹1 లక్ష కోట్ల ప్రభుత్వ–ప్రైవేటు పెట్టుబడులతో అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా అక్టోబర్ 2న మదనపల్లిలో శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమం మదనపల్లి మాత్రమే కాకుండా రాయలసీమలోని ఉద్యానరంగం, రైతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన విస్తృత కార్యక్రమంగా ప్రభుత్వం ప్రకటించింది.
అందుకే మదనపల్లి అభివృద్ధికి సంబంధించిన ఈ ముఖ్యమైన కార్యక్రమంపై ప్రజల స్పందనను కూడా వెలుగులోకి తీసుకురావడం GTV Media బాధ్యతగా భావిస్తోంది.
మదనపల్లి అభివృద్ధిపై మీ మాట… జీటీవీ మీడియా వేదికగా ప్రజలకు చేరాలి.
GTV Media
మీ వార్త… మీ వేదిక… మీ స్వరం
