మదనపల్లి సెప్టెంబర్ 19: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రతగా వుంచడం ప్రజలందరి బాధ్యత అని డీపీవో రాధమ్మ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొండామరిపల్లె గ్రామంలో స్వర్ణాంద్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం – నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ ప్రతి మూడో శనివారం జిల్లా వ్యాప్తంగా సస కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిపై ప్రజలందరికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజలు తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరుగా చెత కుండీల్లో వేయాలన్నారు. ఇళ్ల వద్దకు వచ్చే చెత్తబండిలోనే చెత్తవేయాలని, కాలువలు, వీధుల్లో వేయొద్దని హితవు పలికారు. ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛరథంలో ఇస్తే వస్తువులు ఇస్తారన్నారు. కాచి వడగట్టిన నీటినే తాగాలని, స్వచ్చతాహి సేవా కార్యక్రమంలో భాగంగా నెల రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేరు ంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాజ్మస్రూర్, డిప్యూటీ ఎంపీడీవో భారతి, పంచాయతీ కార్యదర్శి నవాజ్, సిబ్బంది పాల్గొన్నారు..
కొండా మరిపల్లిలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం
