మధ్యాహ్న భోజన పథకం లో కోడిగుడ్లు, చిక్కిలలో జరిగిన అవినీతి మీద విచారణ జరిపించాలిమదనపల్లె, సెప్టెంబర్ 19: అన్నమయ్య జిల్లా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలని ఏపీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తన్న డిమాండ్ చేశారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయం వేదిక ఏపీ స్టూడెంట్ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్తన్న మాట్లాడితూ పాఠశాల స్థాయిలో హెడ్ మాస్టర్స్ ఇండెంట్ ఒక విధంగా, కాంట్రాక్టర్ పరిధిలో ఒక విధంగా జిల్లా విద్యా శాఖ అధికారులు కలిసి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు అందించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావాలనే ఉద్దేశ్యం తోనే అన్నమయ్య జిల్లా విద్యా శాఖ లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం నిర్వహణ చూస్తున్నటువంటి వారి ప్రమేయం తో అవినీతి, అక్రమాలు భారీ స్థాయిలో జరుతున్నాయి అన్నారు. వెంటనే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిటీ వేసి అక్రమాలను తెల్చాలని డిమాండ్ చేశారు. పాఠశాల స్థాయిలో జరిగిందా లేదా జిల్లా విద్యాశాఖ లో అవినీతి జరిగిందా అనే అనుమానం మాకు వ్యక్తం అవుతున్నాయి.కాబట్టి ఉన్నత స్థాయి కమిటీ ని నియమించి సంబంధించిన అధికారులను తప్పకుండా క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ బడులలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వి. ఉత్తన్న, జిల్లా అధ్యక్షులు గంగరాజు, SFI జిల్లా కార్యదర్శి జయబాబు, అశోక్, హరీష్, నంద, కార్తీక్ కుమార్, దీక్షిత్, భార్గవ్, అలీ, అబ్దుల్ మునీర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *