అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థులకు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్, రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఎన్నికల అబ్జర్వర్ గంగారపు రామదాస్ చౌదరి చేతులమీదుగా అందజేసినారు. జనసేన పార్టీ పుంగనూరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చిన్న రాయల్ (సిరివేలు గంగాధర్) సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మదనపల్లె అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్త జంగాల శివరామ్ హాజరైనారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి ఫాం-బి అందజేసినారు. అనంతరం వారు మాట్లాడుతూ తమకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, చిన్న రాయల్, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఫాం-బి అందజేసిన గంగారపు రామదాస్ చౌదరి
