జవహర్ నవోదయ పూర్వ విద్యార్థుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

మదనపల్లె, సెప్టెంబర్ 27: వలసపల్లెలో జవహర్ నవోదయ పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నికలు నిర్వహించి నూతన ఎగ్జిక్యూటివ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ గీత తెలిపారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గీత మాట్లాడుతూ.. నవోదయ విద్యాలయంలో ఇప్పటివరకు 34 బ్యాచ్‌లు విద్యాభ్యాసం పూర్తి చేసి బయటకు వెళ్లాయని తెలిపారు. ప్రతి బ్యాచ్‌ నుంచి ప్రతినిధులు హాజరై జనరల్ బాడీని ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

నూతన కమిటీ

  • గౌరవ అధ్యక్షుడు రాంబాబు, అంజాద్
  • అధ్యక్షుడు:శివానంద రెడ్డి
  • వైస్ ప్రెసిడెంట్: వెంకటేష్
  • జనరల్ సెక్రటరీ:వినీష్
  • జాయింట్ సెక్రటరీ: యుగంధర్ రెడ్డి
  • విమెన్స్ సెక్రటరీ:విద్యాలత
  • కోశాధికారి:బి. వినోద్ కుమార్ రెడ్డి
  • ఎగ్జిక్యూటివ్ సభ్యులు:
  • వినోద్ కుమార్, సీఎం హరి ప్రకాష్ రెడ్డి, చంద్రమౌళి, చైతన్య, రామమూర్తి, ఉష

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మోహనవల్లి, పార్థసారథి, ఎల్లప్ప, రమణ, చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *