మదనపల్లె, సెప్టెంబర్ 9: వ్యాపారులు, ఉద్యోగులు సామాన్య ప్రజలు అందరికీ.. షాకింగ్ న్యూస్..
అదేమంటే ఈనెల వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి.
ఈనెల 11వ తేదీన శుక్రవారం ufbi నాయకులు సమ్మెకు పిలుపునిచ్చారు, ఆరోజు బ్యాంక్ ఉద్యోగులు బంద్ నిర్వహించనున్నారు. మరుసటి రోజు రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు కాగా.. సోమవారం వినాయక చవితి సందర్భంగా బ్యాగులన్నీ సెలవు ప్రకటించారు.
దీంతో నాలుగు రోజులు వరుసగా బ్యాంకులు పనిచేయవు.. అవసరమైన వారు ముందస్తుగా వెళ్లి బ్యాంకుల్లో పని ముగించుకోవాలి.
