
పెట్టుబడులు కూడా రాక అన్నదాతల ఆవేదన.. ప్రభుత్వ జోక్యం కోరుతున్న రైతులు
మదనపల్లె, జూలై 24 (gtv media ప్రతినిధి):
దేశంలోనే ప్రముఖ టమోటా మార్కెట్లలో ఒకటైన అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు ఒక్కసారిగా పతనమవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరకు ఆశాజనకంగా ఉన్న ధరలు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఎకరాకు లక్షల్లో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
పాతాళానికి టమోటా ధరలు.. కుదేలైన మదనపల్లె రైతన్న
మార్కెట్‌కు భారీగా టమోటా రావడం, ఇతర ప్రాంతాల నుంచి డిమాండ్ తగ్గడంతో ధరలు క్షీణించినట్లు వ్యాపారులు తెలిపారు. ఏ-గ్రేడ్ టమోటాకూ ఆశించిన ధర లభించడం లేదన్నారు.
ధరలు మరీ తక్కువగా ఉండటంతో కొందరు రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తుండగా, మరికొందరు అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు.
టమోటాకు గిట్టుబాటు ధర ప్రకటించడంతో పాటు సాగు ఖర్చులపై రాయితీలు కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
