మదనపల్లిలో ముసుగు దొంగల హల్‌చల్

పిఎన్‌టి కాలనీలో రిటైర్డ్ ఆర్‌డబ్ల్యూఎస్‌టీ అధికారి ఇంట్లో భారీ చోరీ

మదనపల్లి, ఆగస్టు 13: (gtvmedia)మదనపల్లి పట్టణంలోని పిఎన్‌టి కాలనీలో ముసుగు దొంగలు హల్‌చల్ చేశారు. రిటైర్డ్ ఆర్‌డబ్ల్యూఎస్‌టీ అధికారి రవీంద్ర ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీగా బంగారం, వెండి, నగదు అపహరించారు.

ముసుగు దొంగలు సీసీ పుటేజ్

ఇంటి కిటికీ చువ్వలను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాను తెరిచి వస్తువులను చిందరవందర చేశారు. అనంతరం సుమారు 400 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, రూ.25 వేల నగదును దొంగిలించి పరారైనట్లు బాధితులు తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించి వివరాలు ఆరా తీశారు.

ఈ ఘటనపై పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *