మదనపల్లిలో మహిళపై హత్యాయత్నం

మదనపల్లె, ఆగస్టు 13: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని మాయాబజార్‌లో గురువారం ఉదయం మహిళపై హత్యాయత్నం కలకలం రేపింది. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ చేనేత కార్మికుడు మహిళపై కొడవలితో దాడి చేసినట్లు సమాచారం.

విచక్షణారహితంగా జరిగిన దాడిలో మహిళకు సుమారు ఎనిమిది కత్తిపోట్లు గాయాలైనట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు సమాచారం. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *