మిట్స్‌లో ఘనంగా ఓణం వేడుకలు

మదనపల్లె: (gtvmedia)మదనపల్లె సమీపంలోని మిట్స్ (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో విద్యార్థులు ఓణం పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో జరుపుకునే పండుగలు ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి, తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, తమిళనాడులో దీపావళి ఎంత ప్రసిద్ధి చెందాయో.. కేరళ రాష్ట్ర పండుగైన ఓణం కూడా ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఓణం పండుగ సమానత్వం, ఐకమత్యం, సంతోషానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు ఇలాంటి సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనడం ద్వారా భారతీయ సంప్రదాయాల వైభవాన్ని తెలుసుకోవాలని సూచించారు.

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా అభివర్ణించిన ఆయన.. యూనివర్సిటీలో కేరళ సంప్రదాయాలకు అనుగుణంగా విద్యార్థులు పూలతో అందంగా అలంకరించిన పువ్వుల ముగ్గులు (పూక్కలం) ఏర్పాటు చేశారు. సంప్రదాయ నృత్యాలు, పాటలు, వివిధ ఆటలతో వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా, ఆర్ట్స్ అండ్ కల్చరల్ కోఆర్డినేటర్ వై. ప్రదీప్ కుమార్, సాక్ కోఆర్డినేటర్ డాక్టర్ రెడ్డి హేమంత్, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *