భార్యను భర్తే నరికి చంపినట్లు కుటుంబీకుల ఆరోపణ.. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన నిందితుడు?
మదనపల్లె, ఆగస్టు 29: (gtvmedia)అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని జగన్ కాలనీలో నివాసం ఉంటున్న దండామని (38) అనే మహిళను ఆమె భర్త మధుకర్ రెడ్డి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దండామని, మధుకర్ రెడ్డి దంపతులు జగన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం జరిగిన ఘటనలో దండామని తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించినట్లు తెలిసింది.
గతంలోనూ నేరారోపణలు
మధుకర్ రెడ్డిపై గతంలో బెంగళూరులో ATMలో మహిళపై దాడి చేసిన కేసుతో పాటు హత్య, పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు పాత కోర్టు రికార్డులు, వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరు ATM దాడి కేసులో ఆయనపై కేసు నమోదై, అనంతరం కోర్టు విచారణ జరిగింది.
ప్రస్తుతం భార్య హత్య కేసులోనూ మధుకర్ రెడ్డి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారా? అనే అంశంపై అధికారిక పోలీసు ధ్రువీకరణ రావాల్సి ఉంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సమాచారం. హత్యకు అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
