కొత్తఇండ్లు ,ఈశ్వరమ్మ కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా

మదనపల్లె, ఆగస్టు 1: (gtvmedia)మదనపల్లె మండలంలోని కొత్తఇండ్లు ఈశ్వరమ్మ కాలనీలో గ్రామంలో శనివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంతో పాటు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోందన్నారు. తాము ఏ పంచాయతీకి, ఏ వార్డుకు వెళ్లినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమని ఆయన అన్నారు.

కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గిరి, మాకినేని చంద్ర,సహదేవ, రాజేష్, హరి, నారాయణ, పతి, రియాజ్‌,దొర తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సరదాగా పాఠశాల ఆవరణలో MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *