అమరావతి: (gtvmedia)ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా సెప్టెంబరు 15వ తేదీ వరకు ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తూ డైరెక్టర్ నరసింహారావు ఆదేశాలు జారీ చేశారు.
ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాల వారీగా ప్రవేశాల సంఖ్య పెరిగేలా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డైరెక్టర్ ఆదేశించారు.
గడువు ముగిసేలోపు అర్హులైన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
