పార్టీ అధికారిక ప్రకటన

శుక్రవారం మదనపల్లిలో వైఎస్సార్‌సీపీ వినతిపత్రం కార్యక్రమం

మదనపల్లె, జూలై 30: (gtvmedia)వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరుకానున్నారు. అలాగే అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొననున్నట్లు వెల్లడించారు.

మదనపల్లె నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది.

(పార్టీ విడుదల చేసిన ప్రకటన)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *