స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యం

నిమ్మనపల్లి మండల నాయకులతో ఎమ్మెల్యే షాజహాన్ భాషా కీలక సమావేశం

మదనపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా నిమ్మనపల్లి మండల నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు.

నిమ్మనపల్లిలో నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ నిమ్మనపల్లి మండలంలో స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాలు, 10 సర్పంచ్ స్థానాలు, ఒక ఎంపీపీ స్థానం, ఒక జడ్పీటీసీ స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *