మదనపల్లె, అక్టోబర్ 20: మదనపల్లిలో కోటి రూపాయలతో అలంకరించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు, మదనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు) దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తన ఎన్నికల కరపత్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని అమ్మవారిని వేడుకున్నారు.
#SriramChinababu #TeluguYuvathaPresident #TeluguYuvatha #Madanapalle
