అన్నమయ్య జిల్లాలో జడ్పిటిసి స్థానాలకు 60 మంది నామినేషన్లు

మదనపల్లి అక్టోబర్ 21 : అన్నమయ్య జిల్లాలోని 25 మండలాల జడ్పిటిసి స్థానాలకు తొలి రోజున 60 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిమ్మనపల్లి రోడ్డు లోని జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో అన్ని మండలాల నుంచి 60 మంది నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో వైసిపి 35, టిడిపి 22, సిపిఐ 3 నామినేషన్లు దాఖలు అయినట్లు జడ్పీ సీఈవో లక్ష్మీపతి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *