శ్రీ యోగభోగేశ్వర స్వామి వారి సన్నిధిలో విజయదశమి వేడుకలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు, సుగవాసి ప్రసాద్ బాబు

మదనపల్లె, అక్టోబర్ 20: విజయదశమి పర్వదినం సందర్భంగా యోగ భోగేశ్వర స్వామి స్వామివారి ఆశీస్సులు పొందిన టీడీపీ నాయకులు.

ఈరోజు ఉదయం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిప్పిలి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా , రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు కలసి శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న నాయకులకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. వేదమంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు, సుగవాసి ప్రసాద్ బాబు ఘజమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ…

విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయానికి, ధర్మం నిలిచిన పవిత్రతకు ప్రతీక అని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక చింతన మరింత పెంపొందాలని కోరుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *